రాబోయే24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడన క్రమంగా బలహీనపడుతుంది-కూర్మనాథ్
అమరావతి: దక్షిణకోస్తా-ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి & ప్రక్కనే ఉన్న పశ్చిమద్య బంగాళాఖాతము దక్షిణ ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలలో కేంద్రీకృతమై ఉన్నదని,,వచ్చే24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతంగా క్రమంగా బలహీనపడుతుందని APSDMA MD రోణంకి కూర్మనాథ్ తెలిపారు.. వీటి ఫలితంగా రాష్ట్రంలోరాగల మూడు రోజుల్లో దక్షిణ కోస్తా:-గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక కురిసే అవకాశముంది.భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది..శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందన్నారు.