భావి భారత దార్శనికుడు మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి-ప్రధాని మోదీ
అమరావతి: మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి హయాంలో దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలను అనుసంధానం చేసిన (నేషనల్ హైవేలు) స్వర్ణ చతుర్భుజి పథకం ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో చెరగనిదని ప్రధాని మోదీ అన్నారు.. డిసెంబర్ 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు..
అటల్ జీ ఎప్పుడు చెప్పేవారు, జీవితం ఈరోజు ఇక్కడితో ఆగిపోదు.. సంచార శిబిరంలాంటిది.. రేపు ఎక్కడికి పోతుందో,, రేపటి ఉదయం ఎవరికి తెలుసు? ఈరోజు ఆయన మనమధ్య ఉండి ఉంటే తన పుట్టిన రోజున కొత్త ఉషస్సును చూసేవాడిని అంటూ ప్రధాని మోదీ భావోద్వేగంగా రాసుకున్నాడు..అయన నన్ను పిలిచి అంక్వార్‌లో కూర్చోబెట్టిన ఆ రోజు నేను మర్చిపోలేను..ఆ తరువాత వీపుపై బలంగా కొట్టారు..ప్రతి నిమిషం దేశ భద్రతపై అప్రమత్తంగా వుండాలన్న హెచ్చరకలా తను అన్పించింది..మోదీపై వాజ్‌పేయికి ఉన్న ప్రేమను గుర్తు చేసుకుంటూ,, ఆ ఆప్యాయత.. ఆ ప్రేమ… తన జీవితంలో గొప్ప అదృష్టమని ప్రధాని మోదీ రాశారు.
రాజకీయ అస్థిరత సమయంలో అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు.. 21వ శతాబ్దాని,, భారతదేశపు శతాబ్దంగా మార్చడానికి అయన సారధ్యంలో NDA ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశానికి కొత్త దిశను,, కొత్త ఒరవడిని అందించాయి అని అన్నారు.. వాజ్‌పేయి ప్రభావం నేటికీ స్థిరంగా ప్రజల మనస్సులో ఉందని ప్రధాని మోదీ అన్నారు.. ఆయన భావి భారత దార్శనికుడు.. ఐటీ, టెలికమ్యూనికేషన్,,టెలికమ్యూనికేషన్ ప్రపంచంలో ఆయన ప్రభుత్వం దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లింది..ఆయన హయాంలో సాంకేతికతను సామాన్యులకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు అప్పటి ఎన్డీయే ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు..భారతదేశంలోని మారుమూల ప్రాంతాలను పెద్ద నగరాలతో అనుసంధానించడానికి విజయవంతమైన ప్రయత్నాలు జరిగాయన్నారు..
వాజ్‌పేయి హయాంలో దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలను అనుసంధానం చేసిన (నేషనల్ హైవేలు) స్వర్ణ చతుర్భుజి పథకం ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో చెరగనిదని ప్రధాని మోదీ అన్నారు. స్థానిక కనెక్టివిటీని పెంచడానికి, NDA సంకీర్ణ ప్రభుత్వం కూడా ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి కార్యక్రమాలను ప్రారంభించిందని,, ఢిల్లీ మెట్రో మాజీ ప్రధాని వాజ్ పేయ్ పాలనలోనే ప్రారంభమైందన్నారు..నేడు తమ ప్రభుత్వం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తొందన్నారు..దేశంలోని సుదూర ప్రాంతాల్లోని గ్రామలను అనుసంధానించడం ద్వారా భారతదేశ ఐక్యతను కూడా బలోపేతం చేశారని మోదీ కొనియాడారు.