జనవరి ఒకటో తేదీ నుంచి పట్టణ ప్రణాళిక విభాగానికి-అదనపు కమిషనర్ నందన్
నెల్లూరు: నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సచివాలయ కార్యదర్శులు, లైసెన్స్ టెక్నికల్ పర్సన్లు, బిల్డర్లు, సివిల్ ఇంజనీర్లతో అదనపు కమిషనర్ నందన్ మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించి డ్రాప్టింగ్ జి.వో ను చదివి వినిపించారు. జనవరి ఒకటో తేదీ నుంచి పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి నూతన విధివిధానాలను నిర్దేశిస్తూ రానున్న జీవో కు సంబంధించి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే నేరుగా కార్యాలయంలో కానీ లేదా వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చని అదనపు కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో సిటీ ప్లానర్ హిమబిందు, అసిస్టెంట్ సిటి ప్లానర్లు వేణు, ప్రకాష్, సచివాలయ వార్డు ప్లానింగ్ కార్యదర్శులు, ఎల్.టి.పి లు, సివిల్ ఇంజనీర్లు, బిల్డర్లు పాల్గొన్నారు.