మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ-మంత్రి నాదెండ్ల
అమరావతి: మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.. ఏప్రిల్ 30వ తేదీతో ekyc ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు..మంగళవారం మంత్రి నాదెండ్ల సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామన్నారు.. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ల్పిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు.. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయన్నారు..గతంలో వైసీపీ ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు.. ekyc పూర్తి అయిన తరువాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి తెలిపారు.