వైపీసీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు విచారణ గురువారంకు వాయిదా
అమరావతి: వైపీసీ నెల్లూరుజిల్లా అధ్యక్షడు,,మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది..తన క్లయింట్ కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కాకాణి తరపు న్యాయవాదులు వాదించారు..ఆయనపై పెట్టిన కేసులు కూడా అంత తీవ్రమైనవి కాదని వాదనలు వినిపించారు.. ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు విన్పిస్తూ కాకాణిపై SC,ST కేసు కూడా నమోదైందని కోర్టుకు తెలిపారు..SC,ST కేసు వివరాలను పిటీషనర్‌కు అందచేయడంతో పాటు కోర్టు కూడా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది..ఈ దశలో SC,ST కేసులో కాకాణిని అరెస్టు చేసే అవకాశం ఉందని, అందువల్ల ఎల్లుండి వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు కోరారు..ఇందుకు కోర్టు నిరాకరిస్తూ SC,ST కేసులో అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇవ్వకూడదని గతంలో ఇదే కోర్టు ఆదేశించిందని,,అందువల్ల అటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది..కాకాణికి రెండుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదని,, విచారణకు సహకరించడం లేదని కోర్టు దృష్టికి ప్రభుత్వ న్యాయవాది తీసుకొచ్చారు..కేసు విచారణను గురువారం (ఏప్రిల్ 3) కేసును పూర్తి స్థాయిలో విచారిస్తామని న్యాయమూర్తి ఇరుపక్షాల న్యాయవాదాలుకు స్పష్టం చేశారు.