ప్రతిభకు పట్టం కట్టేలా షైనింగ్ స్టార్స్ అవార్డ్స్- మంత్రి అనగాని సత్య ప్రసాద్
విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ..
తిరుపతి: ప్రతిభకు పట్టం కట్టేలా, విద్యార్థులను ప్రోత్సహించేలా షైనింగ్ స్టార్స్ అవార్డ్స్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ఇవ్వడం జరిగిందని రెవెన్యు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి-జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.సోమవారం ఉదయం స్థానిక మహతి ఆడిటోరియంలో 10వ తరగతి-ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టేలా, విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించేలా విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 2024-25 సం..అత్యధిక మార్కులు సాధించిన వారికి షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పేదరికం వలన విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశ్యంతో విలువలతో కూడిన విద్య ను తీసుకువచ్చేలా రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖా మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. 2024-25 విద్యాసంవత్సరంలో జిల్లాలో ఉత్తమ మార్కులు సాధించిన 207 మంది10 వ తరగతి, 40 మంది ఇంటర్ విద్యార్థినీ విద్యార్థుల కు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ తో పాటు రూ.20 వేల నగదు, మెడల్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
తిరుపతి, సత్యవేడు శాసనసభ్యులు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించే దిశగా షైనింగ్ అవార్డులను ఇవ్వడం శుభ పరిణామమని తెలిపారు. పేదరికం, అసమానతలు రూపు మాపాలంటే విద్య ద్వారానే సాధ్యమని ఆ దిశగా విద్యా శాఖా మంత్రి విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తున్నారని తెలిపారు.