లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్
అమరావతి: లాంగ్ రేంజ్ హైపర్ సోనిక్ క్షిపణి పరీక్షను ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డీఆర్‌డీవో ఈ క్షిపణిని ఆదివారం వేకువజామున విజయవంతంగా పరీక్షించింది..ఇది 1500 కిలోమీటర్లకు మించిన వివిధ పే లోడ్లను సునాయాసంగా లక్ష్యాని ఛేదిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు..దీర్ఘ శ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో భారత్ డిఫెన్స్ రంగంలో ఓ పెద్ద మైలు రాయిని దాటిందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు..ఈ చారిత్రక ఘట్టంతో అత్యాధునిక మిలటరీ టెక్నాలజీని సాధించిన అతి కొద్ది దేశాలు అమెరికా,,రష్యా,,చైనా తరువాత జాబితాలో భారత్ చేరింని వెల్లడించారు..