ప్రధాని మోదీకి అత్యుతన్న పురస్కరం ప్రకటించిన నైజీరియా
అమరావతి: భారతదేవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి నైజీరియాలో ఘన స్వాగతం లభించింది..ప్రధాని మంత్రి నరేంద్రమోదీని “గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్” ను నైజీరియా ప్రకటించింది..ఈ గౌరవాన్ని అందుకున్న రెండో విదేశీ సెలబ్రిటీగా ప్రధాని మోదీ నిలిచారు..1969లో GCON అవార్డు పొందిన ఏకైక విదేశీ సెలబ్రిటీ క్వీన్ ఎలిజబెత్..ప్రధాని మోదీకి ఇది 17వ అంతర్జాతీయ అపూర్వ సత్కరం..మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం నైజీరియా చేరుకున్నారు..మరాఠీ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చినందుకు,నైజీరియా ప్రధానికి అక్కడ స్థిరపడ్డ మరాఠీలు కృతజ్ఞతలు తెలిపారు.. ప్రధాని మోదీ రాక సందర్భంగా మరాఠీ సంప్రదాయ లావని నృత్యం ప్రదర్శించారు..నైజీరియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో మోదీ సమావేశమవుతారు..ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు.. రేపు జీ-20 సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లనున్నారు..జీ-20 దేశాధినేతలతో భేటీ సమావేశం అనంతరం ప్రధాని మోదీ మంగళవారం గయానాలో పర్యటించనున్నారు…