ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీకి కొలుకోలేని దెబ్బ
అమరావతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ఆద్మీ పార్టీకి కొలుకోలేని దెబ్బ తగిలింది.. ఢిల్లీలో ఆమ్ఆద్మీ ఢిల్లీ సీఎంగా అతీశీ కొనసాగుతున్నారు..ఆప్ ప్రభుత్వంలో రావాణాశాఖ మంత్రిగా పనిచేస్తున్న కైలాష్ గెహ్లాట్, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు లేఖను పంపారు.. తన రాజీనామాకు గల కారణాలను లేఖలో వివరించారు..
కేజ్రీవాల్ కు రాసిన లేఖలో కైలాష్ గెహ్లాట్ తన రాజీనామాకు గల కారణాలను ప్రస్తావిస్తూ, ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుందని నేను మీకు చెప్పాలనుకున్నాను..రాజకీయ అధికారం కోసం ప్రజలను విస్మరించాం..అనేక వాగ్ధానాలు నెరవేరలేదు.. ఇందుకు ఉదారహరణ….మనం యమునా నదిని స్వచ్ఛమైన నదిగా చేస్తామని వాగ్దానం చేశాము…అయితే ఇంత వరకు చేయక పోవడంతో, ప్రస్తుతం యమునా నది గతంలో కంటే కలుషితమైంది.. మరో బాధాకరమైన విషయం ఏమిటంటే…ప్రజల హక్కుల కోసం పోరాడకుండా కేవలం మన రాజకీయ ఎజెండా కోసమే పోరాడుతున్నాం…దింతో ఢిల్లీ ప్రజలు కనీస సేవలు కూడా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఢిల్లీ ప్రభుత్వం కేంద్రంతో తగాదలతోనే ఎక్కువ సమయం గడిపిందే కాని ఢిల్లీకి ఏమీ జరగదని ఇప్పుడు స్పష్టమైందని తెలిపారు..ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో నా రాజకీయ ప్రయాణం ప్రారంభించాను..అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేయడం తప్ప నాకు మరో మార్గం లేదు..నేను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని కైలాష్ గెహ్లాట్ లేఖలో పేర్కొన్నారు.