ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఎమర్జెన్సీ చిత్రం, విడుదలకు తేదీలు ఖరారు
అమరావతి: కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో, అమె నటించిన ఎమర్జెన్సీ చిత్రం విడుదలకు ముందే పలు వివాదాల్లో చిక్కుకుని,,వాయిదా పడుతూ వస్తోన్న ఆ సినిమా ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్‌ను ఖరారు అయింది..ఈ విషయాన్ని కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ,,ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరి 17వ తేది 2025న సినిమా థియెటర్లల్లో ప్రదర్శితం కానున్నట్లు తెలిపారు..మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా,,ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను సినిమాలో ప్రముఖంగా చిత్రకరించినట్లు తెలుస్తొంది..ఈ సినిమా ప్రోమో విడుదలైనప్పటి నుంచే ఓ వర్గం తమ గురించి తప్పుగా చిత్రీకరించారంటూ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది.. దీంతో, సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సంబంధించి పలు సన్నివేశాల్లో అభ్యంతరం వ్యక్తం చేసింది..
తమ చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వడంలేదంటూ కంగన అసహనం వ్యక్తం చేశారు.. న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమౌవుతున్న నేపధ్యంలో ఎమర్జెన్సీ చిత్రం విషయంలో ఓ నిర్ణయానికి రావాలంటూ బాంబే హైకోర్టు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్స్ సర్టిఫికేషన్‌ను ఆదేశించింది..దింతో ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్ అక్టోబర్ 17వ తేదిన వచ్చింది..తమ సినిమాకు సెన్సార్ పనులు పూర్తైనట్లు కంగన, సోషల్ మీడియా వేదికగా తెలిపారు..మళ్లీ ఈ చిత్రం పై పలు కోర్టుల్లో కేసులను ఎదుర్కొంటూ వచ్చింది..ఇదే సమయంలో సినిమా విషయంలో కంగన హత్యా బెదిరింపులు కూడా ఎదుర్కొన్నారు..ఈ చిత్రానికి ఆమె దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ అధ్బుతంగా నటించినట్లు సిని వర్గాలు వ్యాఖ్యనిస్తున్నాయి..చూడాలి మరి ఎమర్జీన్సీ ఎలా వుండబోతుందొ ?