అన్యమత ఉద్యోగుల సేవలకు చెక్-శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్ రద్దు
టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు..
తిరుమల: కొత్తగా ఏర్పడి టీటీడీ పాలకమండలి సమావేశం సోమవారం జరిగింది..ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది..పాలకమండలిలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెలియ చేశారు.. శ్రీవారి దర్శనం కోసం సర్వ దర్శనంలో వెళ్ళే భక్తులు తక్కువ సమయంలోనే దర్శనం చేసుకునే విధంగా సరికొత్త విధానం తీసుకుని రానున్నామని చెప్పారు.. తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతి రద్దు చేస్తున్నట్లు, హోటల్ కి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుంటామని తెలిపారు.. తిరుమల టూరిజం కేంద్రం కాదు,,,ఆధ్యాత్మిక కేంద్రం,,, హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో పర్యాటకానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు..అంతేకాదు తిరుమలలో అతిథి గృహాలకు సొంతపేర్లు పెట్టరాదన్నారు..
టీటీడీ కీలక నిర్ణయాలు..
1-శ్రీవాణి ట్రస్ట్ రద్దు,, శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్‌ను ఆలయ ప్రధాన ఖాతాకే అనుసంధానం
2- తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం,,అతిక్రమిస్తే కేసులు నమోదు
3-టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం మరో రూ.1500 పెంచి ఇవ్వాలని నిర్ణయం
4-ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్లను వెనక్కి తీసుకుని,,జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు
5-టీటీడీ నుంచి అన్యమత ఉద్యోగుల తొలగింపు లేదా వీ.ఆర్.ఎస్
6-ఇతర డిపార్ట్ మెంట్లకు అన్యమత ఉద్యోగులను తరలింపు
7-తిరుమల ఫ్లైఓవర్ కు గరుడ వారధి పేరు పునరుద్ధరణ
8-మూడు నెలల్లో డంపింగ్ యార్డులో చెత్తను తరలించాలని నిర్ణయం
9-లడ్డూ ప్రసాదంలో మరింత నాణ్యత పెంచాలని నిర్ణయం
10-ఔట్ సోరింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని నిర్ణయం
11-టీటీడీలో ఉద్యోగులకు 10శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం
12-టూరిజం శాఖకు ఇచ్చే 4 వేల SED టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం
13-AI సహకారంతో సామాన్య భక్తులకు 2,,3 గంటల్లోనే దర్శనం కల్పించేలా మార్పులు చేసేందుకు చర్యలు
14-తిరుపమల్లో శారదా పీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం,,బిల్డింగ్స్ ను కూల్చి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.