400 ఎకరాల అటవీ భూములను,రెవెన్యూ భూములుగా మార్చేసి లాక్కున్నారు-పవన్ కల్యాణ్
అమరావతి: వైసీపీ అధినేత,, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూములకు సంబంధించిన బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు..మంగళవారం పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం,, వేమవరం, చెన్నాయపాలెం గ్రామాల్లోని సరస్వతి పవర్ ప్లాంట్ కు గతంలో కేటాయించిన భూములను ఆయన పరిశీలించారు..అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ హయాంలో ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ తీసుకు వచ్చారని గుర్తు చేశారు..ఈ ప్రాంతంలో 400 ఎకరాల అటవీ భూములుంటే,, వాటిని రెవెన్యూ భూములుగా మార్చేసి లాక్కున్నారని మండిపడ్డారు..2009లో ఈ భూములను 30 ఏళ్లకు లీజుకు తీసుకుని,,మళ్లీ వాటిని 50 ఏళ్లకు పెంచారని చెప్పారు.. తాము పరిశ్రమ ఏర్పాటు చేసి అందులో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఈ భూములు విక్రయించేలా నాటి పెద్దలు నమ్మబలికారన్నారు..రైతుకు ఇష్టం లేకున్నా, ఈ భూములు అమ్మాల్సిన పరిస్థితి తీసుకు వచ్చారని వెల్లడించారు..అందుకోసం ప్రజలు, రైతులపై నాయకులు తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చారన్నారు..ప్లాంట్ ప్రారంభించే వరకు భూముల్లో సేద్యం చేసుకుంటామని రైతులు తెలిపితే,, పెట్రోల్ బాంబులు వేసి వారిని భయపెట్టారని గుర్తు చేశారు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వేధించి వేధించి చంపేశారన్నారు..ఫర్నిచర్‌పై శివప్రసాదరావును వేధించిన వ్యక్తే, ప్లాంట్ పేరుతో భూములు లాక్కున్నారంటూ వైఎస్ జగన్‌పై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.. ఎస్సీ కుటుంబాలకు చెందిన 24 ఎకరాల భూమిని భయపెట్టి మరీ తీసుకున్నారని తెలిపారు..
సహాజ వనరులు ఒకరి సొత్తు,,సొంతం కాదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.. పోలీస్ ఉన్నతాధికారులు సైతం మెత్తబడిపోయారన్నారు.. లేకుంటే వారు సైతం భయపడుతున్నారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.. స్థానిక యువతను గత ప్రభుత్వంలోని వారు భయపెడితే ఊరుకుంటారా ? పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు వేసి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ? రౌడీయిజాన్ని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.. వైసీపీ నాయకులు ఇంకా తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు..శాంతి భద్రతలు అంటే ఎంత బలంగా ఉంటాయో వాళ్లకు చూపించాలని పోలీస్ అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు.