జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల మెరుపు దాడిలో CRPF ఇన్‌స్పెక్టర్ మృతి
అమరావతి: జమ్మూ కశ్మీర్‌లో ఉదంపూర్ జిల్లాలోని దుడు ప్రాంతంలో సోమవారం మధ్యహ్నం 3 గంటల సమయంలో ఉగ్రవాదులు CRPF,SOG సైనికులపై మెరుపు దాడికి దిగారు..ఈ దాడిలో CRPF యొక్క 187వ బెటాలియన్‌లో ఇన్‌స్పెక్టర్ కుల్దీప్ సింగ్ తీవ్రగాయాలు పాలైయ్యాడు..వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికి బుల్లెట్ గాయంతో మరణించాడని సంబంధిత వర్గాలు న్యూస్ ఏజెన్సీకి తెలిపాయి..ఉగ్రవాదుల కదలికి ఎక్కువగా వున్న దుడు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బెటాలియన్‌ను మరింతగా మోహరించేందుకు భారత సైన్యం చర్యలు చేపట్టింది.. ఆ క్రమంలో బెటాలియన్‌పై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగాయి..జమ్మూలోని కొండ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు భారత సైన్యం శ్రీకారం చుట్టింది..సంఘటన ప్రదేశంలో సీఆర్పీఎఫ్ పోస్ట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాకాలు చేస్తుంది.. సోమవారం సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఆ ప్రాంతానికి చేరుకుంది.. ఈ విషయాన్ని పసిగట్టిన ఉగ్రవాదులు,,సీఆర్పీఎఫ్ బృందంపై మెరుపు దాడికి దిగారు.