వైద్యురాలు అత్యాచార ఘటనపై మమతా బెనర్జీ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీంకోర్టు
అమరావతి: పశ్చిమ బెంగాల్ వైద్యురాలు అత్యాచార సంఘటనపై సుప్రీం కోర్టు త్రీ సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది..వైద్యురాలిపై అత్యాచారం భయంకరమైన చర్యగా అభివర్ణించింది.. హత్య కేసులో FIR నమోదు చేయడంలో జాప్యంపై బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.. FIR, 12 గంటలు ఆలస్యంగా ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది.. బెంగాల్ ప్రభుత్వం,,ఆసుపత్రి అధికారులు ఏం చేస్తున్నారని మండిపడింది..ఈ కేసుకు సంబంధించి ఈనెల 22వ తేది లోపు ఈ సంఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. దేశవ్యాప్తంగా డాక్టర్లు,,మహిళల రక్షణకు జాతీయ స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.. 10 మంది సభ్యులతో కూడిన ప్రముఖ డాక్టర్లు, నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు వెలువరించారు..సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్.కె.శరిన్ అధ్యక్షతన జాతీయ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కానుంది..అన్ని ఆస్పత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది..
10 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్:- డా. నాగేశ్వర్ రెడ్డి (ఏఐజీ),,డా. ఎం. శ్రీనివాస్ (దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్),,డా. ప్రతిమ మూర్తి, బెంగళూరు,,డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి,,డాక్టర్ సౌమిత్ర రావత్,,ప్రొఫెసర్ అనితా సక్సేనా, ఎయిమ్స్ దిల్లీ కార్డియాలజీ హెడ్,,ప్రొఫెసర్ పల్లవి సప్రే (డీన్- గ్రాంట్ మెడికల్ కాలేజ్, ముంబైయి),,డాక్టర్ పద్మ శ్రీవాస్తవ (న్యూరాలజీ విభాగం, ఎయిమ్స్),,క్యాబినెట్, కేంద్ర హోం, ఆరోగ్య శాఖల కార్యదర్శులు అలాగే నేషనల్ హెల్త్ కమిషన్ ఛైర్‌పర్సన్ వుంటారు.