బోయింగ్ 777/ఎయిర్‌బస్ విమానాలు దిగేందుకు సిద్దమైన రేణిగుంటలో ఎయిర్ పోర్టు-విమానాశ్రయ డైరెక్టర్
తిరుపతి: రేణిగుంటలో ప్రస్తుతమున్న 2285 మీటర్ల పొడవు గల రన్‌వేను 1285 మీటర్లు పెంచడంతో ప్రస్తుతం రన్‌వే పొడవు3810 మీటర్లుకు చేరుకుందని తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.. రన్‌వే పొడవు పెరగడంతో బోయింగ్ 777/ఎయిర్‌బస్ 330 వంటి పెద్ద విమానాలు తిరుపతి విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యేందుకు వీలు కలిగిందన్నారు.. భారతదేశంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నిర్వహిస్తున్న రన్‌వేలన్నింటిలో ఇది అత్యంత పొడవైనదని వెల్లడించారు.. DME గరిష్ట విమానాల నిర్వహణ సామర్థ్యం రోజుకు 100 విమానాల నుంచి 200 విమానాలకు పెరుగుతుందన్నారు..రన్‌వే విస్తరణ పనులకు మొత్తం వ్యయం రూ. 153.16 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు.. శుక్రవారం ఎం సురేశ్, మెంబర్ (ANS), వర్చువల్ మోడ్ ద్వారా ప్రారంభోత్సవం చేయగా AAI ఏకే గుప్తా, మెంబర్ (ప్లానింగ్),,తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారని తెలిపారు..
కొత్తగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలు:- 2025 ఫిబ్రవరి 20న ట్రాన్స్-ఇన్స్టాల్డ్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS), కొత్త డాప్లర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్ని రేంజ్ (DVOR) డిస్టెన్స్ మెజరింగ్ ఎక్విప్మెంట్ (DME)తో పాటు 240 మీటర్ల విమానాశ్రయ రన్ వే పొడిగింపు భాగం కమీషనింగ్..
కొత్తగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాల వల్ల విమానాశ్రయ రోజు వారీ కార్యక్రమాలు మెరుగు పడతాయన్నారు.. డాప్లర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్ని రేంజ్ అండ్ డిస్టెన్స్ మెజరింగ్ ఎక్విప్మెంట్ (DME):- రన్‌వే-26 కోసం కొత్త మోపియన్స్ DVOR/DME ప్రారంభించడం..
ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS):- థాలెస్ ILS, కేట్-1 రూ. 4.4 కోట్ల అంచనా వ్యయంతో ట్రాన్స్-ఇన్స్టాల్ చేశారు., ILS వల్ల కనీస దృశ్యమానత అవసరం 1500 మీటర్ల నుండి 700 మీటర్లకు తగ్గుతుంది., అన్ని వాతావరణ పరిస్థితులలో విమానాలు సజావుగా దిగడానికి వీలుగా గ్లైడ్ యాంగిల్ కూడా 3.2 డిగ్రీల నుండి 3 డిగ్రీలకు తగ్గించగలుగుతారు.