అమెరికా ఫెడరల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ (FBI) డైరెక్టర్‌గా కాశ్ పటేల్
అమరావతి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వీర విధేయుడు అయిన భారతీయ అమెరికన్ కాశ్ పటేల్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొత్త డైరెక్టర్‌గా నియమించడానికి సెనెట్ గురువారం ఆమోదం తెలిపింది..FBI డైరెక్టర్‌గా కాశ్ నియామకాన్ని అలస్కాకు చెందిన రిపబ్లికన్లతో పాటు కొందరు డెమోక్రాట్లు వ్యతిరేకించారు..చివరకు 51-49 ఓట్ల తేడాతో కాశ్ నియామకం పూర్తయింది..FBI డైరెక్టర్ పదవి చేపట్టిన తొలి హిందూ,, భారతీయ అమెరికన్‌గా కాశ్ పటేల్ నిలిచారు.. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాశ్ పటేల్ నియామకాన్ని అమెరికా అధ్యక్షుడి అసిస్టెంట్, వైట్‌హౌస్ డిప్యూటీ ఛీఫ్ ఆఫ్ స్టాప్ డాన్ స్కావినో స్వాగతించారు..కాశ్ పటేల్ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్‌కు చెందిన వారు. కాశ్ పటేల్ తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లారు..ఆ తరువాత వారు అమెరికాకు వలస వచ్చారు..1980లో న్యూయార్క్ లోని గార్డెన్ సిటీలో కాశ్ పటేల్ జన్మించారు.. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.. ఆ తర్వాత మియామీ కోర్టులో వివిధ హోదాల్లో పని చేశారు.