వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ మే 1 నుంచి 4 వరకు-కేంద్ర మంత్రి
అమరావతి: భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(WAVES)ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది..ఈ సమ్మిట్‌కు సంబంధించి ప్రధాని మోదీ భారతదేశంతోపాటు,, ప్రపంచంలోని పలు రంగాల ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు..భారతీయ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖ నటీనటులు,, వ్యాపార వేత్తలతో సమావేశంమై సలహాలు సూచనలను అడిగి తెలుసుకున్నారు..
వేవ్స్ సమ్మిట్ 2025 మే 1 నుంచి 4 వరకు వేవ్స్ సమ్మిట్ ను నిర్వహించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు..ఈ సమ్మిట్ కు సంబంధించి పలు కీలక విషయాలను శనివారం తెలిపారు.. మే 1 నుంచి 4వ తేదీ వరకు వేవ్స్ సమ్మిట్ ముంబై వేదికగా జరగనుందని సోషల్ మీడియా వేదికగా పలు వివరాలను వెల్లడించారు.. ప్రపంచంలోనే సృజనాత్మక శక్తి కేంద్రంగా మారడానికి భారతదేశం పునాది వేస్తోందిని అందుకోసం WAVES సమ్మిట్ 2025 నిర్వహిస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు..‘‘ప్రధానమంత్రితో సలహా బోర్డు స్ఫూర్తిదాయక సమావేశం తరువాత ప్రధాని మోదీ భారతదేశాన్ని ప్రపంచ కంటెంట్ హబ్‌గా మార్చడానికి మొదటి ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (WAVES 2025) ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.. ఈ సమ్మిట్ ప్రపంచంలోని అగ్రశ్రేణి మీడియా CEOలు, వినోద రంగంలోని అగ్రతారలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనాత్మక కలిగిన ప్రముఖులను ఒక వేదికపై తీసుకుని రానున్నదని తెలియ చేశారు..
https://x.com/AshwiniVaishnaw/status/1888239407913730268