ఫిబ్రవరి 12,13 తేదీల్లో అమెరికాలో అధికారికంగా పర్యటించనున్న ప్రధాని మోదీ
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తేదీలు ఫైనల్ అయ్యాయి..ఫిబ్రవరి 12,,13 తేదీల్లో ప్రధాని మోదీ అమెరికాలో అధికారికంగా పర్యటిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శుక్రవారంనాడు మీడియాకు తెలిపారు..ప్రధాని మోదీ తన పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలుసుకుంటారు.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకరాం చేపట్టిన తరువాత ప్రధాని మోదీ జరుపుతున్న తొలి పర్యటన..ట్రంప్ ప్రమాణస్వీకారం అనంతరం మొదటగా కలుసుకోనున్న కొద్ది మంది ప్రపంచ నేతల్లో మోదీ ఒకరు అని మీడియా సమావేశంలో వెల్లడించారు..అమెరికా అధ్యక్షుడిని వచ్చేవారంలో కలుసుకునేందుకు భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించినట్టు వైట్‌హౌస్ ప్రతినిధి ఇటీల ప్రకటించిన నేపధ్యంలో ప్రధానిమోదీ పర్యటన తేదీలు ఖరారు అయ్యాయి..ఈ పర్యటనలో అమెరికాతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవడంపై సమావేశం కానున్నట్లు తెలుస్తొంది..అలాగే అమెరికాలోని స్కిల్డ్ వర్కర్లకు వీసాల మంజూరును సులభతరం చేయాలని ప్రధానంగా ఈ పర్యటనలో ట్రంప్ దృష్టికి మోదీ తీసుకువచ్చే అవకాశాలున్నాయి.