NATIONAL

CPI(M) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

అమరావతి: CPI(M) జాతీయ ప్రధాన కార్యదర్శి,,మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి (72) సాయంత్రం 3.03 గంటలకు కన్నుమూశారు..గత నెల 19 నుంచి శ్వాసకోశ సంబంధిత అనారోగ్యం సమస్యతో ఎయిమ్స్ లో చికిత్స పొందుతు తుది శ్వాస విడిచారు.. గత రెండు రోజులుగా ఆరోగ్యం విషమించడంతో ఈనెల 9వ తేదీ నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు.. సీతారాం ఏచూరి శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ అవడంతో పాటు మందులకు ఆ ఇన్‌ఫెక్షన్‌ తగ్గకపోవడంతో వైద్యులు విదేశాల నుంచి మెడిసిన్‌ తెప్పించినట్లు తెలిసింది.. పలు విభాగాలకు చెందిన స్పెషలిస్టు వైద్యుల బృందం చికిత్స అందించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు..ఏచూరి విద్యార్థి నాయకుడిగా దాదాపు 50 ఏళ్ల క్రితం సీపీఎంలో చేరారు..2005 నుంచి 2015 వరకు వరుసగా మూడు సార్లు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు..2018లో మళ్లీ ఆ పదవికి ఎన్నికయ్యారు..సీతారాం ఏచూరీ చెన్నైలో తెలుగు కుటుంబంలో 1952 ఆగస్టు 12న జన్మించారు..ఏచూరి హైదరాబాద్‌లో విద్యాభ్యాసం ప్రారంభించి, ఢిల్లీలో పూర్తి చేశారు..JNU విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థిక శాస్త్రం చదివారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *