NATIONAL

జమ్ములో ఉగ్రవాదుల ఏరివేతకు రంగంలోకి 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు

అమరావతి: జమ్ముకశ్మీర్​లో ఇటీవల వరుసగా జరిగిన ఉగ్రదాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.. ముష్కరులను ఏరివేసేందుకు సిద్ధమైంది..జమ్ము,,కాశ్మీరులో రోడ్డు మార్గంలోని బ్రిడ్జీల రక్షణను పటిష్ట పర్చడంతో పాటు అడవులు,,కొండ ప్రాంతాల్లో తిష్ట వేసి వున్న ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఇప్పటికే 3500 నుంచి 4 వేల మంది భద్రతాదళాల సైనికులు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు..ఉగ్రవాదులను తుదముట్టించేందుకు హెలికాప్టర్లు,, డ్రోన్లతో ముష్కరమూకల కోసం జల్లెడ పడుతున్నారు.. జమ్ములో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో భారత్‌లోకి ప్రవేశించిన 50-55 మంది ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది..

ఇటీవల జమ్ము, రాజౌరి, పూంచ్, రియాసి, కఠువా జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదుల రెచ్చిపోతున్న నేపధ్యంలో భద్రతాదళాలు విస్తృతంగా సెర్చ్‌ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.. ఇటీవల జరిగిన దాడుల్లో ఉగ్రవాదులు అనుసరించిన గెరిల్లా యుద్ధవ్యూహాలు,, ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదుల వద్ద దొరికిన అత్యాధునిక ఆయుధాలను చూస్తే, వారు సాధారణ ఉగ్రవాదులు కాదని అర్దమౌతొంది..వారిలో కొందరు పాకిస్థాన్‌కు చెందిన మాజీ సైనికులు ఉండొచ్చని ఇంటలిజెన్స్‌ వర్గాలు అనుమానిస్తున్నాయి..

ఇలాంటి వారిని తుడిచి పెట్టేందుకు భద్రతదళాలకు అదనంగా 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను రంగంలో దించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి..నిఘా వర్గాలు ఉగ్రవాదులకు అండదండలు అందించేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *