AP&TGDEVOTIONALOTHERS

ఉజ్జ‌యిని మహంకాళి బోనాల జాత‌ర-21, 22 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు వ‌చ్చే ప్ర‌యాణికులు..

హైద‌రాబాద్ : ఈ నెల 21వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మహంకాళి బోనాల జాత‌ర జ‌ర‌గ‌నున్న నేపధ్యంలో జాత‌ర‌కు అధికారులు,,ఆల‌య సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు.. బోనాల జాత‌ర‌కు వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉండడంతో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.. 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు..ఉజ్జ‌యిని మ‌హంకాళి దేవాలయంకు 2 కిలో మీట‌ర్ల ప‌రిధిలో ఈ అంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి..

క‌ర్బాలా మైదాన్, రాణిగంజ్, రామ్‌గోపాల్‌ఫేట్ ఓల్డ్ పీఎస్, పార‌డైస్, సీటీవో ప్లాజా, ఎస్బీఐ ఎక్స్ రోడ్, వైఎంసీఏ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోట‌రీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, పార్క్‌లేన్, బాటా, బైబిల్ హౌజ్, మినిస్ట‌ర్ రోడ్, ర‌సూల్‌పురా వైపు వ‌చ్చే వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు..

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు వ‌చ్చే ప్ర‌యాణికులు, స్టేష‌న్‌లోకి ప్లాట్ ఫాం నంబ‌ర్ 1 నుంచి కాకుండా ప్లాట్ ఫాం నంబ‌ర్ 10 నుంచి లోప‌లికి చేరుకోవాల‌ని పోలీసులు ప్ర‌యాణికుల‌కు సూచించారు..

మూసివేసిన రోడ్లు:- టోబాకో బ‌జార్ నుంచి మ‌హంకాళి టెంపుల్‌కు వ‌చ్చే రోడ్,,,బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట పోలీసుస్టేషన్ వ‌ర‌కు,,,జ‌న‌ర‌ల్ బ‌జార్ రోడ్,,,ఆద‌య్య ఎక్స్ రోడ్లు..

దారి మ‌ళ్లించిన రోడ్లు: 1–సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బ‌స్సుల‌ను చిల‌క‌ల‌గూడ ఎక్స్ రోడ్డు మీదుగా గాంధీ హాస్పిట‌ల్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, క‌వాడిగూడ‌, మారియ‌ట్ హోట‌ల్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు..
2-సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సుల‌ను బేగంపేట నుంచి క్లాక్ ట‌వ‌ర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు మీదుగా మ‌ళ్లించ‌నున్నారు..3- బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ వ‌చ్చే వాహ‌నాల‌ను స‌జ్జ‌నాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లేదా హిల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు..4-ఎస్బీఐ ఎక్స్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహ‌నాల‌ను ప్యాట్నీ ఎక్స్ రోడ్, ప్యార‌డైస్, మినిస్ట‌ర్ రోడ్ లేదా క్లాక్ ట‌వ‌ర్, సంగీత్ ఎక్స్ రోడ్, సికింద్రాబాద్ స్టేష‌న్, చిల‌క‌ల‌గూడ‌, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, క‌వాడిగూడ‌, మారియ‌ట్ హోట‌ల్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు..5-ప్యార‌డైస్ నుంచి బైబిల్ హౌస్ వైపు వెళ్లే వాహ‌నాల‌ను ఆర్పీ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు లేదా పార‌డైస్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు..6-
హ‌కీంపేట్, బోయిన్‌ప‌ల్లి, బాలాన‌గ‌ర్, అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సుల‌ను క్లాక్ ట‌వ‌ర్ వర‌కే అనుమ‌తించ‌నున్నారు.. మ‌ళ్లీ ప్యాట్నీ, ఎస్బీఐ ఎక్స్ రోడ్ మీదుగా త‌మ గ‌మ్య‌స్థానాల‌కు వెళ్లాల్సి ఉంటుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *