అంతరిక్షంలోకి రాకెట్ల ప్రయోగంలో శతకంను సాధించేందుకు సిద్దమైన ఇస్రో
అమరావతి: అంతరిక్షంలోకి రాకెట్ల ప్రయోగంలో శతకంను సాధించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) సిద్ధమైంది..దేశీయ నావిగేషన్ వ్యవస్థ “NavIC”లో NVS-02 ఉపగ్రహాన్ని చేర్చేందుకు ఇస్రో సమయుత్తం అయింది.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్ నుంచి తన 100వ ప్రయోగమైన GSLV-F15 రాకెట్‌ను బుధవారం నింగిలోకి పంపనుంది..ఇస్రో ఇప్పటి వరకు దేశీయంగా రూపొందించిన 10 క్రయోజనిక్ రాకెట్‌లు,దిగ్విజయంగా అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశ పెట్టాయి..GSLV-F15 రాకెట్ ఈ సిరీస్‌లో 17వది..ఇందుకు సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం వేకువజామున 2 గంటల 53 నిమిషాలకు ప్రారంభమయంది..27 గంటలపాటు ఈ కౌంట్‌డౌన్ కొనసాగనుంది..బుధవారం ఉదయం 6 గంటల 23 నిమిషాలకు షార్‌లోని రెండో ల్యాంచ్‌ఫ్యాడ్ నుంచి GSLV-F15 రాకెట్ NVS-02 ఉపగ్రహాంతో నింగిలోకి దూసుకెళ్లనుంది..
సెకండ్ జెనరేషన్ శాటిలైట్:- ఈ ప్రయోగం తరువాత NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు.. దీని ద్వారా దేశీయ నావిగేషన్ వ్యవస్థ (నావిక్) సేవాలు మరింత విస్తృతం కానున్నాయి..ఈ ఉపగ్రహం సెకండ్ జెనరేషన్ శాటిలైట్..2023 మే 29వ తేదిన తొలి NVS-01 ఉపగ్రహాన్నిఇస్రో నింగిలోకి పంపింది..రేపు ప్రయోగించనున్న NVS-02 ఉపగ్రహం ఈ సిరీస్‌లో రెండో ఉపగ్రహం..ఇందులో L1, L5, S బ్యాండ్‌లలో నావిగేషన్ పేలోడ్లతో పాటు C బ్యాండ్ రేజింగ్ పేలోడ్స్ ఉంటాయి..
GPSకు ప్రత్యామ్నాయం:- భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ(“NavIC”),, అమెరికాకు చెందిన GPSకు ఇది ప్రత్యామ్నాయం..భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఖచ్చితమైన లోకేషన్,,స్పీడ్,,టైమ్ సర్వీసులను అందించడం కోసం తయారు చేయడం జరిగింది..
ఇస్రో పాటిస్తున్న సంప్రదాయం:- ముఖ్యమైన ప్రయోగాలు వున్న సందర్బంలో ఇస్రో చైర్మన్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు..ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ తిరుమల ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ శ్రీహరికోట నుంచి 100వ ప్రయోగం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు..