మార్చి 24, 25 తేదీల్లో బ్యాంకుల సమ్మెను విరమించుకుంటున్నాం-యూఎఫ్‌బీయూ
అమరావతి: ది యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తమ డిమాండ్లను నెరవేర్చాలని లేని పక్షంలో మార్చి 24, 25 తేదీల్లో సమ్మె చేస్తామని ప్రకటన చేసిన విషయం విదితమే..శుక్రవారం యూఎఫ్‌బీయూ, సెంట్రల్ లేబర్ కమిషనర్ మధ్య జరిగిన సమావేశం ఫలవంతమైనదంటూ, 2 రోజుల దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె నిర్ణయాన్ని యూఎఫ్‌బీయూ వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది..అన్ని క్యాడర్లలో నియామకాలతో పాటు వారానికి 5 రోజుల పనిదినాలు,, ఇతర సమస్యల పరిష్కారానికి సానుకూల పరిణామాల నేపథ్యంలో సమ్మెను ఒకటి లేదా రెండు నెలలు వాయిదా వేయాలని తాము నిర్ణయించుకున్నామని పేర్కొంది..తదుపరి చర్చలు ఏప్రిల్ మూడవ వారంలో జరగనున్నాయని తెలిపింది.