ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ బంగ్లాలోని గదిలో భారీ మొత్తంలో నోట్ల కట్టలు
అమరావతి: ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న న్యాయమూర్తి ఇంట్లోని గదుల్లో భారీ మొత్తంలో నగదు బయట పడడం సంచలనం రేపుతొంది..గత వారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీలో లేని సమయంలో ఆయన అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించింది.. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు..మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బందికి కళ్లు బైర్లు కమ్మేలా గదుల్లో నోట్ల కట్టలే కనిపించాయి..దింతో ఫైర్ సిబ్బంది విషయంను ఉన్నతధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు..అక్కడ కన్పించిన డబ్బు అంతా ప్రభుత్వానికి లెక్క చూపని నగదుగా పోలీసులు అనుమానించారు.. ఉన్నతధికారులు ఈ విషయంను సుప్రీం కోర్లు చీప్ జస్టిస్ కు తెలియ చేశారు..జడ్జి ఇంట్లో భారీ మొత్తంలో నగదు బయటపడటంతో భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. జస్టిస్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.. అక్కడ ఆయన హైకోర్టు జస్టిస్ గా అక్టోబర్ 2021 వరకు పనిచేశారు.. అక్రమార్జన విషయంలో జస్టిస్ వర్మపై దర్యాప్తుకు ఆదేశించడంతో పాటు అభిశంసన ప్రక్రియపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.. జస్టిస్ వర్మను బదిలీ చేయడం వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతింటుందని,, న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం సన్నగిల్లుతుందని కొలీజియంలోని కొందరు న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు.. జస్టిస్ వర్మ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వారు కోరారు..ఒక వేళ రాజీనామాకు ఆయన నిరాకరిస్తే, పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది..