జూనియర్ డాక్టర్ల ఆందోళనతో దిగి వచ్చిన మమతా బెనర్జీ
3 డిమాండ్లకు అంగీకరం..
అమరావతి: పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ల ఆందోళనతో మమతా ప్రభుత్వం దిగిరాక తప్పలేదు..కోల్‌కతాలో నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల డిమాండ్లు నెరవేర్చేందుకు మమతా ప్రభుత్వం అంగీకరించింది.. నాలుగుసార్లు రద్దు అయిన తరువాత సోమవారం రాత్రి జూనియర్ డాక్టర్లు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపారు.. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో జూనియర్ డాక్టర్లు ఐదు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు..5 డిమాండ్లలో 3 కి మమతా ప్రభుత్వం అంగీకరించింది..ఈ మేరకు వైద్యవిద్యార్దుల డిమాండ్లు నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టింది.. ఇందులో భాగంగానే వైద్యులతో సమావేశం ముగిసిన తరువాత కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, వైద్యశాఖకు చెందిన ఇద్దరు అధికారులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది..వారి స్థానంలో మంగళవారం కొత్త అధికారులను నియమించనున్నట్లు వెల్లడించింది..మిగిలిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కార్యాచరణ చేపట్టనున్నదని చర్చల ముగిసిన అనంతరం స్వయంగా మమత ప్రకటించారు..డిమాండ్లకు అంగీకారం తెలిపిన నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు ఆందోళనలను విరమించాలని మమతా బెనర్జీ కోరారు.. ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోమని, వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు..ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కోసం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని సైతం నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు..ఈ సందర్బంలో డాక్టర్ల నిరసనకు నాయకత్వ వహిస్తున్న వారిలో ఒకరు మాట్లాడుతూ మమతా బెనర్జీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి చేసే వరకు పూర్తి స్థాయిలో సమ్మె విరమించేది లేదని తెలిపారు..ముఖ్యంగా వైద్య,ఆరొగ్యశాఖలో పెరుకుని పోయిన అవినితిపై లోతైన దర్యప్తు జరగాలన్న తమ డిమాండ్ పై ఇంకా స్పష్లత రాలేదన్నారు.