మన రాజ్యాంగం సజీవమైన,ప్రగతిశీల పత్రం-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అమరావతి: భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది..ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగానికి రాజేంద్ర ప్రసాద్, అంబేడ్కర్ మార్గనిర్ధేశం చేశారని కొనియాడారు..75 సంవత్సరాల సంస్మరణ పోస్టేజ్ స్టాంప్‌ను,, ఓ నాణాన్ని విడుదల చేశారు..ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి ప్రసంగిస్తూ, గత దశాబ్ద కాలం నుంచి సమాజంలో అన్ని రంగాలోని,,ముఖ్యంగా బలహీన వర్గాల సంక్షేమం గురించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.. పేదలకు సొంత ఇళ్ల లభిస్తున్నాయని,, దేశంలో ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాల కల్పన జరుగుతున్నట్లు తెలిపారు..మన రాజ్యాంగం సజీవమైన.. ప్రగతిశీల పత్రం అని పేర్కొన్నారు..మన రాజ్యాంగం ద్వారా, సామాజిక న్యాయం, సమాంతర అభివృద్ధి లాంటి లక్ష్యాలను అందుకున్నట్లు రాష్‌్ర పతి ద్రౌపది వెల్లడించారు..గత 10 సంవత్సరా నుంచి అనేక కీలకమైన మార్పులు జరిగాయని,, జీఎస్టీతో పాటు భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చిందన్నారు..వెనుకబడిన తరగతుల ప్రజల కోసం ప్రభుత్వం అసాధారణ రీతిలో కార్యక్రమాలు చేపట్టిందన్నారు.. మైథిలీ,,సంస్కృత భాషల్లో కూడా రాజ్యాంగాన్ని రాష్‌్రఅపతి ఆవిష్కరించారు.