DISTRICTS

గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు-కలెక్టర్

జాతీయ క్రీడా దినోత్సవం..
నెల్లూరు: గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియం నుంచి కరెంట్ ఆఫీస్ సెంటర్ వరకు క్రీడాకారులు, విద్యార్ధినీ విద్యార్ధులతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ను కలెక్టర్ ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు. తొలుత ఎసి సుబ్బారెడ్డి స్టేడియం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. తదుపరి వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ప్రతి రోజూ ఆటపాటలతో కొద్దిపాటి వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉంటామని విద్యార్ధినీ విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ప్రమాణం చేయించారు. ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆగస్టు 29 వ తేదిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వివిధ స్థాయిల్లో నిర్మాణంలో ఉన్న స్టేడియంలను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని మొగళ్లపాలెం లో అన్ని హంగులతో పూర్తయిన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రజా ప్రతినిధుల సమక్షంలో త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా నరేగా ఉపాధి పనుల్లో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మైదానాలను అభివృద్ధి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి యతిరాజ్ , జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి పెంచలయ్య, జిల్లా బిసి సంక్షేమ అధికారి వెంకటయ్య , జిల్లా ఒలింపిక్ అసోసియషన్ కార్యదర్శి గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *