బై బై వైసీపీ-రాజ్యసభ పదవికి రాజీనామ చేసిన మోపిదేవీ,బీదా
అమరావతి: రాజ్యసభ పదవికి, YSRCPకి మోపిదేవి వెంకట రమణ,, బీద మస్తాన్ రావులు గురువారం పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు స్పీకర్ ఫార్మాట్‌లో మధ్యాహ్నం 12:30 గంటలకు రాజీనామా పత్రాలను అందజేశారు.. అనంతరం YSRCP ప్రాథమిక సభ్యత్వంకు సైతం రాజీనామా చేశారు..రాజీనామ అనంతరం మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ చిల్లరగా మాట్లాడే మనస్తత్వం తనది కాదని,,రాజ్యసభ పదవిపై తానకు మొదటి నుంచి ఇష్టం లేదన్నారు.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో చేరుతానని మోపిదేవి వెంకట రమణ ప్రకటించారు.. రాజకీయ వ్యవస్థను,, రాష్ట్ర పరిపాలన గాడిలో పెట్టాలని చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు..నియోజకవర్గం వెళ్లిన కార్యకర్తలతో సమావేశం అవుతానని,,రాజీనామా చేసిన తరువాత తాను ఖాళీగా ఉండాలని అనుకోవడం లేదన్నారు.. వైసీపీ అధినేత జగన్ తన వైఖరి మార్చుకోవాలన్నారు.. పార్టీ మారుతున్న తనపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు..గతంలో తనకు ఎలాంటి ఇబ్బందులు కలగజేసారో అందరికీ తెలుసని మోపిదేవి తెలిపారు.బీదామస్తాన్ రావు మాట్లాడుతూ ఎలాంటి ప్రలోభలు లేకుండా తనకు రాజ్యసభ్య పదవీ కాలంలో మరో 4 సంవత్సరాలు,,మోపిదేవికి మరో 2 సంవత్సరాలు వున్నప్పటికి రాజీనామ చేయడం జరిగిందన్నారు..ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ,గతంలో తనకు చంద్రబాబు బాస్ అని,,తాను 32 సంవత్సరాలు టీడీపీలో వున్న సంగతి గుర్తు చేశారు..ఎన్నికల సమయంలోనే రాజకీయా వుంటాయని,,ఎన్నికల తరువాత అందరం సఖ్యత వుంటామంటూ ముక్తాయింపు ఇచ్చారు..
త్వరలోనే మరి కొందరు:- వీరి బాటలోనే అయోధ్యరామిరెడ్డి,, పిల్లి సుభాష్ చంద్రబోస్,,గొల్ల బాబూరావు,,మేడా రఘునాథరెడ్డి,, ఆర్.కృష్ణయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి? వీరంతా వైసీపీని వీడి టీడీపీ, బీజేపీ, జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు విన్పిస్తున్నాయి..చూడాలి మరి ఏం జరుగుబొతుందొ ?.