సీ.ఎం చంద్రబాబు అధ్యక్షతన పేపర్‌లెస్‌గా E-క్యాబినెట్ సమావేశం-కీలక నిర్ణయాలు
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పేపర్‌లెస్‌గా E-క్యాబినెట్ సమావేశం బుధవారం నిర్వహించారు.. అజెండా మొదలుకొని నోట్స్ వరకు ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే మంత్రులకు అందజేసింది..ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిపి,,మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని మంత్రి పార్థసారధి మీడియా సమావేశంలో తెలిపారు.. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేయడం,, పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో తొలగింపు,,పొలల్లో సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మతొలగించడం జరుగుతుందన్నారు..పోలవరం ఎడమ కాలువ పునరుద్ధరణ పనుల్లో ప్రస్తుత కాంట్రాక్ట్ సంస్థనే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకొవడం జరిగిందన్నారు.. ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణ చేయడంతో పాటు ఇందుకు అనుగుణంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో (SEB) రద్దుకు ఆమోదం కేబినెట్ అమోదం తెలిపిందన్నారు..వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని,,అలాగే సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం అమెదించామన్నారు.