AP&TG

కూటమి అధికారంలో ఉన్నంత వరకు విద్యుత్ చార్జీలు పెంచం-సీ.ఎం చంద్రబాబు

అమరావతి: కూటమి అధికారం చేపట్టిన రోజు నుంచి విద్యుత్ చార్జీలు పెంచమని, ప్రజలపై భారం వేయమని,, అయితే గత ప్రభుత్వం చేసిన తప్పదాలకు ప్రస్తుతం మనం అందరం చార్జీలను చెల్లించాల్సి వుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.. రాజధాని ప్రాంతం అభివృద్ధి కోసం 400 కేవీ విద్యుత్ సరఫరా లైన్లు శాశ్వత మళ్లింపు పనులను ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు.. విద్యుత్ రంగంలో నూతన సంస్కరణలతో నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు..లో ఓల్టేజ్,, షార్ట్ సర్క్యూట్ సమస్యలు ఈ విధానంలో గణనీయంగా తగ్గుతాయన్నారు..నేడు శంకుస్థాపన చేసిన పనులు ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు..కూటమి అధికారంలో ఉన్నంత వరకు విద్యుత్ చార్జీలు పెంచమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు..గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచిందని,,ఇందుకు గుణపాఠంగా మీరు ఆ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టారని చంద్రబాబు అన్నారు.. గత ప్రభుత్వ పాలనపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. వైసీపీ ప్రభుత్వం లాలూచీ పడి విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి చేశారని అన్నారు.. దుర్మార్గపు ఆలోచనలతో విద్యుత్ ఒప్పందాలను జగన్ రద్దు చేశారని మండిపడ్డారు.. పీపీఏల రద్దుపై కోర్టులు మొట్టికాయలు వేసినా మారలేదన్నారు.. వాడని విద్యుత్ కు రూ.9వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు.. తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.32,166 కోట్ల భారం మోపారని చంద్రబాబు చెప్పారు.. గత ప్రభుత్వం హాయంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని,, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసేందుకు ఒక్కో ఇటుక పేర్చుతున్నామని అన్నారు..గత ప్రభుత్వంలో రూ.10లక్షల కోట్ల అప్పులు చేసి,, ఖజానా ఖాళీ చేశారని,,ఒక్క రూపాయి కూడా మిగల్లేదన్నారు..ఉపాధి హామీ పథకం నిధులుకూడా దారి మళ్లించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.. సంక్రాంతి నాటికి గ్రామీణ రోడ్లలో గుంతలు లేకుండా చేస్తామని చెప్పారు.

రాజధానిలో అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించేదుకు రూ.505 కోట్లతో నిర్మించిన GIS విద్యుత్ సబ్ స్టేషన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రూ.5407 కోట్లతో నిర్మించిన ఎన్టీఆర్ జిల్లా,, గుంటూరు,,చిత్తూరు,, నంద్యాల,,శ్రీ సత్య సాయి,, శ్రీకాకుళం,,అనకాపల్లి,, కృష్ణా,,ప్రకాశం,, తిరుపతి,, కడప జిల్లాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు..తాళ్లాయపాలెంలో 400/220 kv గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ ఉపకేంద్రాన్ని(GIS) ప్రభుత్వం నిర్మించింది..ఈ కేంద్రాన్ని ట్రాన్స్‌ మిషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేసింది.. ఇప్పటి వరకు రాజధాని ప్రాంతానికి 220/132/33కేవీ తాడికొండ కేంద్రం నుంచి కరెంట్ సరఫరా అవుతోంది.. ప్రస్తుతం నిర్మించిన 400/220 విద్యుత్ కేంద్రంతో పాటు నేలపాడులో 220/33 kv విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *