జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పిడిగుద్దలు విసురుకున్నఎమ్మెల్యేలు
అమరావతి: ఆర్టికల్ 370 అంశంపై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గురువారం ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకుంటూ సభలో వాగ్వాదానికి దిగారు.. అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే,, ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఆర్టికల్ 370పై బ్యానర్‌ను ప్రదర్శించడంతో గందరగోళం మొదలైంది..బ్యానర్ ప్రదర్శనపై LoP సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు..ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి ప్రత్యేక హోదాను పునరుద్ధరించడానికి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ను 2019 ఆగష్టు 5వ తేదిన రద్దు చేసింది.. ఆర్టికల్ 370 పునరుద్దరించాలని ఎన్సీ ప్రభుత్వం తీర్మానం చేయడంతో బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు..ఈ సమయంలో షేక్ ఖుర్షీద్ వెల్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు..తీర్మానాన్ని ఆమోదించాలంటూ ఎన్‌సీ సభ్యులు నినాదాలు చేశారు.. ఎన్సీ ప్రభుత్వ తీరుపై కేంద్రం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.