కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏకాంతంగా సమావేశం అయిన ఉప ముఖ్యమంత్రి పవన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్,, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బుధవారం సమావేశం అయ్యారు..బుధవారం సాయంత్రం క్యాబినెట్ సమావేశం అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి డిప్యూటీ సీఎం నేరుగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.. అక్కడ నుంచి అమిత్ షా ఇంటికి వెళ్లారు.. అనంతరం ఆయనతో పవన్ మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు..ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి అమిత్ షాతో పవన్ ఏకాంతంగా సమావేశం అయ్యారు.. ఇరువురి మధ్య దాదాపు 15 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చ జరిగింది.. సహకార శాఖతోపాటు పంచాయతీ రాజ్, అటవీ పర్యావరణ శాఖల నుంచి ఏపీకి నిధుల కేటాయించాలని పవన్ కోరినట్లు సమాచారం..రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులపైనా మాట్లాడినట్లు తెలుస్తొంది..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పరిణామాలు,, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అమిత్ షాతో పవన్ చర్చించినట్లు తెలుస్తొంది.. సమావేశం అనంతరం ఆయన తిరిగి రాష్ట్రానికి బయలుదేరారు.