అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకిరణాల తిలకం
అమరావతి: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాలరాముని ఆలయ నిర్మాణం తర్వాత 2వ సారి శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి..మార్చి 29వ తేది నుంచి వసంత నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి..అదివారం మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడికి అభిషేకం చేశారు..ఇదే సమయంలో 12 గంటలకు సూర్యకిరణాలు బాల రాముడి నుదిటిపై నాలుగు నిమిషాల పాటు ప్రసరించాయి..ఈ అద్భుతాన్ని చూసి భక్తులందరూ తరించారు.. సూర్యకిరణాలు ప్రసారించే సమయంలో గర్భాలయంలో లైట్లు ఆర్పివేయడంతో సూర్య తిలకం దృశ్యాలు మరింత శోభాయమానంగా వెలుగొందాయి..శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.. దింతో ప్రపంచవ్యాప్తంగా భక్తులు తమ ఇళ్ల నుంచే ఈ అద్భుతాన్ని చూసి తరించారు..శ్రీరామ నవమి సందర్బంగా అయోధ్యకు దాదాపు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచన వేసిన ఆలయ ట్రస్ట్,భక్తుల కోసం పలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.. సామాన్య భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ప్రత్యేక పాస్‌లను రద్దు చేసింది..ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, తాగునీటి ఏర్పాట్లు, తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు, ఏడు చోట్ల 108 అంబులెన్సులను సిద్ధం చేసింది.. డ్రోన్ల సాయంతో సరయూ నది జలాలను భక్తులపై చల్లుతుండటంపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.