వరదల ధాటికి రూ.6,800 కోట్ల నష్టం, కేంద్రానికి ప్రాథమిక నివేదిక-ఆర్పీ సిసోడియా
అమరావతి: ఈ నెల 1వ తేదిన కళింగపట్నం వద్ద తీరం దాటిని తుఫాన్ ప్రభావంతో మొదలైన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా అతలాకుతలం అయింది..ఎన్టీర్ జిల్లాలో 21 సెంటిమీటర్ల పడాల్సి ఉండగా 34.5 సెం.మీ. వర్షపాతం నమోదైందని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు..ఎగువ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో 11.35 లక్షల క్యూసెక్కుల వరద కృష్ణానదికి వచ్చిందని తెలిపారు.. ప్రకాశం బ్యారేజికి పూర్తి కెపాసిటి వరద నీరు రావడంతో బుడమేరు వాగుకు 7 వేల నుంచి 35 వేల క్యూసెక్కుల వరద వచ్చిందని చెప్పారు..సోమవారం (9వ తేది) నుంచి మూడు రోజులు నష్టం అంచనాలు వేస్తామని,,ఆరోజు ఇంటి యజమాని కచ్చితంగా ఆ ఇంట్లోనే ఉండాలని సూచించారు..
విజయవాడ భారీ వర్షాలకు దెబ్బతిందని చెప్పారు.. సహాయక చర్యలపై 24/7 అప్రమత్తంగా ఉన్నామన్నారు.. అన్ని ప్రభుత్వ శాఖలతోపాటు కేంద్ర సంస్థలతోనూ సంప్రదిస్తున్నామని తెలిపారు..రిలీఫ్ కేంద్రాలకు 45 వేలమందిని తరలించామని,,32 జేసీబీలు పెట్టామని, డ్రోన్ల ద్వారా ఆహారం అందిస్తున్నామని వెల్లడించారు.. 21 మందిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించామని అన్నారు.. వరద విపత్తు వల్ల రాష్ట్రానికి 6880.23 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది.. ఈ మేర కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది..రెవెన్యూ శాఖకు 750 కోట్ల నష్టం, పశు సంవర్ధక శాఖకు 11.58 కోట్ల నష్టం, మత్స్య శాఖకు 157.86 కోట్ల నష్టం, వ్యవసాయ శాఖకు 301.34 కోట్లు నష్టం, ఉద్యాన శాఖకు 39.95 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలో పేర్కొంది. విద్యుత్ శాఖకు 481.28 కోట్లు, ఆర్ అండ్ బీ 2164.5 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా 75.59 కోట్లు, పంచాయతీ రోడ్లు 167.55 కోట్లు, నీటి వనరులు 1568.55 కోట్లు, పురపాలక, అర్బన్ 1160 కోట్లు, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్కు 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసింది..వరదల కారణంగా 43 మంది మరణించారని,, ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 35 మంది చనిపోయారని చెప్పారు.