సీఎం సహాయ నిధికి రూ.కోటి చెక్కు అందచేసిన పవన్ కళ్యాణ్
రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలి..
అమరావతి: జనసేన కేంద్ర కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వినాయక చవితి పూజలు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూజలు చేశారు..విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని,, విజయాలు సిద్ధించాలని అభిలషించారు..ఈ కార్యక్రమంలో పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయ నిధికి రూ.కోటి చెక్కు:- విజయవాడ కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పవన్ కల్యాణ్,, సీఎం సహాయ నిధికి రూ.కోటి చెక్కును అందజేశారు..గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు..ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద పూజలు చేశారు..ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెంనాయుడు పాల్గొన్నారు.