శివాజీ సెంటర్ లోని వినాయకుడిని చూసి ప్రజలందరూ తరించాలి-ఎం.పీ వేమిరెడ్డి
నెల్లూరు: గత 40 సంవత్సరాలుగా నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్డు శివాజీ సెంటర్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేస్తున్న వినాయకుడి విగ్రహాన్ని చూసి ప్రజలందరూ తరించాలని నెల్లూరు ఎం.పీ వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి అకాంక్షించారు.శనివారం ఉదయం అయన సతీమణి కోవూరు ఎమ్మేల్యే వేమిరెడ్డి.ప్రశాంతితో కలసి శివాజీ సెంటర్ లోని వినాయకుడికి పూజలు నిర్వహించారు.అనంతరం అయన మీడియాతో మాట్లాడారు. ఈకార్యక్రమంలో శివాజీ సెంటర్ మిత్రమండలి సభ్యులు సురేంద్రరెడ్డి,రంగనాథ్,కె.వి,ప్రకాష్ తదితరలు పాల్గొన్నారు.