వరద బాధితులను అదుకునేందుకు విరాళాలు ప్రకటిస్తున్న చిత్ర పరిశ్రమ
రూ.కోటి రూపాయలు ప్రకటించిన పవన్..
అమరావతి: భారీ వర్షాల కారణంగా సంభంవించిన వరదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర నష్టం సంభవించింది.. దింతో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులను సాయం చేసేందుకు మానవత్వంతో అందరూ ముందుకు రావాలి పిలుపునిచ్చారు..ఈ నేపధ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,,ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు.. నందమూరి బాలకృష్ణ- ఏపీకి రూ.50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు,,జూనియర్ ఎన్టీఆర్- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు,,వైజయంతీ మూవీస్- ఏపీకి రూ. 25 లక్షలు,,త్రివిక్రమ్ – రాధాకృష్ణ – నాగవంశీ: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు,,ఆయ్ మూవీ నిర్మాత బన్నీ వాస్: ‘ఆయ్’ ఈ వారం కలెక్షన్స్ లో 25 శాతం ఏపీకి అందిస్తున్నాట్లు ప్రకటించారు.