సోమవారం నాటికి అల్పపీడనం,వాయుగుండంగా మారే అవకాశం
అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది..ఈ నేపధ్యంలో శని,అదివారల్లో కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని,, ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల (సోమవారం) 9వ తేదీ నాటికి ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు..
దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.. శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని,,తీరం వెంట బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.. విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తర వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.