రాష్ట్రానికి పొంచి వున్న మరో ముప్పు-పై నుంచి పోటైతుతున్న వరద నీరు
వాయుగండం ?
అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండం మారి వాయువ్య దిశగా కదులుతోంది.. రాజస్థాన్‌లోని బికనేర్ నుంచి ఒడిశాలోని పారాదీప్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి ఏర్పడిందని వాతావరణశాఖ స్పష్టం చేసింది..ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం వున్నట్లు అధికారులు పేర్కొన్నారు..వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది..వర్షాలు, వరదలతో అల్లకల్లోలంగా మారిన రాష్ట్రాన్ని మరోసారి వరదలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.. పది రోజులుగా బుడమేరు పొంగిపొర్లి విజయవాడ నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..
పులివాగు,, మున్నేరు:- భారీ వర్షాల కారణంగా పులివాగు నుంచి బుడమేరుకు మరింత వరద వస్తొంది.. ఇదే సమయంలో తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని మున్నేరుకు క్రమంగా వరద పెరుగుతోంది..ఖమ్మం పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువైతే ఇంకా ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు..పోలంపల్లి జలాశయం వద్ద శనివారం రాత్రి 9 గంటలకు 6,046 క్కూసెక్కుల వరద వచ్చిందని,,వరద ఉధృతి క్రమంగా పెరుగుతూ అదివారం ఉదయం 5 గంటలకు 41,473 క్కూసెక్కులకు చేరిందని పేర్కొన్నారు..మున్నేరు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు..నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన మొదలైంది..
రాళ్ల కింద నుంచి నీరు లీక్:- బుడమేరు వద్ద గండి పూడ్చిన ప్రాంతంలో రాళ్ల కింద నుంచి సుమారు 500క్యూసెక్కుల నీరు లీక్ అవుతోందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు..ఈ వరద మెుత్తం విజయవాడ వైపు వెళ్తోందని,,ఈ నీటిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు.. పులివాగుకు వరద భారీగా పెరిగిందని..అది బుడమేరులో కలుస్తోందని వెల్లడించారు..శనివారంతో పోలిస్తే బుడమేరు వరద ప్రవాహం కొంతమేర పెరిగిందని,,ప్రస్తుతానికి 2,500 క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తోందని, యుద్ధ ప్రతిపాదికన కట్టకు మూడో లేయర్ వేస్తున్నట్లు తెలిపారు..ఈ పనులు పూర్తయితే బుడమేరుకు 10వేల క్యూసెక్కుల వరద వచ్చినా ముప్పు ఉండదన్నారు..బుడమేరు కుడి పక్క కట్టలకు 7 చోట్ల గండ్లు పడ్డాయని,, ఇప్పటికే ఒక దాన్ని పూడ్చామని,,మిగిలిన వాటి పనులూ జరుగుతున్నట్లు వెల్లడించారు.