రెండుగా విడిపోయిన మగధ్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు
అమరావతి: ఇటీవల కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్ల ప్రమాదలు చోటు చేసుకుంటున్నాయి..ఈ సంఘటనల పట్టి చూస్తే, అరాచక శక్తులే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పపడుతున్న అనుమానలు తలైతున్నాయి.. వందేభారత్ ట్రైయిన్ పైకి రాళ్ల రువ్వడం,,రైల్వే ట్రాక్ పై కాంక్రీటు దిమ్మెలు పెట్టడడం,,రైలు పట్టాలపై ఇనుప వస్తువులను వుంచడం లాంటి సంఘటనలు ఇప్పటి వరకు చోటు చేసుకోగా నేడు…. బిహార్‌లో మగధ్ ఎక్స్ ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది..బాక్సర్ జిల్లాలోని ట్వినిగంజ్-రఘునాథ్‌పూర్ స్టేషన్ల మధ్య న్యూఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగధ్ ఎక్స్ ప్రెస్ రైలు బోగీలు రెండు భాగాలుగా విడిపోయాయి..ఆదివారం ఉదయం 11.08 గంటలకు మగధ్ ఎక్స్ ప్రెస్ రైలులోని కోచ్ నెంబర్ S 6, S 7 బోగీల మధ్య కప్లింగ్ ఉడిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు..ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని తూర్పు మధ్య రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు..ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సాంకేతిక బృందం ఘటన స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు చేపట్టిందని తెలిపారు..ఈ ఘటన జరిగిన వెంటనే ఈ మార్గంలో వెళ్ల వలసిన పలు రైళ్లు మరో మార్గంలో మళ్లించామని,,మూడు గంటల అనంతరం మగధ్ ఎక్స్ ప్రెస్ రైలు ఇస్లాంపూర్‌కు బయలుదేరి వెళ్లిందని తెలిపారు.. రైల్వే సేప్టీ బోర్డు ఈ సంఘటనపై విచారణకు ఆదేశించింది.