ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు- కలెక్టర్లతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం,వాయుగుండం మారుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సైతం హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది..సంబంధిత జిల్లాల్లో పరిస్థితులపై జిల్లా కలెక్టర్లను, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలర్ట్ చేశారు..సీ.ఎం జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలను టెలీకాన్ఫరెన్స్ లో జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు..తమ తమ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలు, సన్నద్ధతను సీఎంకు,కలెక్టర్లు వివరించారు..ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, కలెక్టర్లకు పలు సూచనలు చేస్తూ, జిల్లాల్లో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు..ఆదివారం రాత్రి, సోమవారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తోందని,, ఏలేరు రిజర్వాయర్‌కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉందన్నారు.. ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని కలెక్టర్లకు సూచించారు..కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా జగ్రత్తలు తీసుకోవాలన్నారు..భారీ, అతిభారీ వర్షాలు పడే ప్రాంతంలో తాగునీరు, ఆహారం, మెడికల్ క్యాంప్‌లను సిద్ధంగా ఉంచాలని అలాగే ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలన్నారు.. ముందస్తు చర్యలతో ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చునని,,పంట నష్టం అంచనా, బాధితులకు ఆహారం సరఫరా, వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లు వినియోగించవచ్చునని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు.. ఏజెన్సీలో భారీ వర్షాలు, వాగులు వంకల పరిస్థితిపై అధికారులు నిరంతరం సమాచారం తెప్పించుకోవాలని కలెక్టర్లకు సీఎం సూచించారు..ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఒక జిల్లా నుంచి మరో జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు..అలాగే వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్‌లు పంపించాలన్నారు..2 వేల మందికి పైగా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం అందిస్తున్నామని ఏలూరు జిల్లా కలెక్టర్ తెలిపారు..విజయనగరం జిల్లాలో శనివారం,,నేడు(ఆదివారం) భారీ వర్షాలున్నాయని, దానికి అనుగుణంగా రాకపోకలను బ్రిడ్జిలపై నియంత్రిస్తున్నామని, ప్రజలకు అవసరమైన సమాచారం ఇస్తున్నామన్న కలెక్టర్ తెలియచేశారు..నాగావళి, వంశధార నదులకు వరద పెరిగే అవకాశం ఉందన్న అంచనాలకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, సీఎం సూచించారు..బాపట్ల జిల్లాలో పునరావాస కేంద్రాల్లో పెరుగుతున్న బాధితుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వివరించారు.