కాళింది ఎక్స్ ప్రెస్‌కు తప్పిన పెనుముఫ్పు-రైలు పట్టాలపై LPG గ్యాస్ సిలెండర్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలపై ప్రభుత్వంపైన ఆరోపణలు చేస్తు వస్తున్నారు..అయితే ఈయన చేసే ఆరోపణల్లో రైళ్లు ప్రమాదాలకు ఎందుకు జరుగుతున్నాయి ? ఇందుకు కారకులరైన వారిని గురించి ఒక్క ముక్క మాట్లాడడు ? ఎంత సేపటికి రైల్వే మంత్రి రాజీనామ చేయాలి ? కేంద్ర ప్రభుత్వం విఫలం అయింది అంటూ మాట్లాడడమే ? దేశంలోని కొంత మంది ప్రేరిపిత వ్యక్తులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పపడుతున్నారు ? అంలాటి వారిని పట్టుకుని కఠినంగా శిక్షించండి అని ఎనాడు మాట్లాడడు ? ఎందుకంటే ఓట్ల రాజకీయం మరి ?.ఈ నేపధ్యంలో…
అమరావతి: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాళింది ఎక్స్ ప్రెస్‌కు (14117) కొద్దిలో పెను ప్రమాదం తప్పింది.. కాన్పూర్‌లోని అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ రైలు మార్గంలో పట్టాలపై ఉన్న గ్యాస్ సిలిండర్‌ను రైలు ఢీకొట్టింది..ఈ ప్రమాదంలో రైలుకు ఎలాంటి నష్టం జరుగలేదు..కాళింది ఎక్స్ ప్రెస్ యూపీలోని ప్రయాగ్‌రాజ్ నుంచి కాన్పూర్ సెంట్రల్ మీదుగా హర్యానాలోని భివానీకి వెళ్తున్నది..ఈ నేపధ్యంలో ఆదివారం రాత్రి 8.15 గంటలకు శివరాజ్‌పూర్ ప్రాంతాంలో రైలు పట్టాలపై ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించిన లోకోపైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలు నిలిపి వేశాడు.. అప్పటికే పట్టలపై వున్న గ్యాస్ సిలిండర్‌ను రైలు ఇంజిన్ ఢీకొట్టడంతో సిలిండర్ పట్టాలకు సుమారు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది..ఈ సంఘటనలో రైలుకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు..వెంటనే లోకో పైలెట్ ప్రమాదం గురించి గార్డ్ రాజీవ్ కు,,గేట్‌మెన్ పప్పు పాల్‌కు సమాచారం ఇచ్చాడు..సమాచారంను అందుకున్న రైల్వే గేట్ మెన్ పప్పు,,RPF పోలీసులకు తెలియచేశారు..వెంటనే ఆర్పీఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది..విచారణ అనంతరం RPF ఇన్‌స్పెక్టర్ ఓపీ మీనా బృందం సిలిండర్‌ను స్వాధీనం చేసుకుంది..సంఘటనా స్థలంలో ఒక పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టను కూడా గుర్తించారు..రైలును పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని ప్రేరిపిత వ్యక్తులు వీటిని ట్రాక్‌పై పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు..నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.. రైలును 20 నిమిషాలు నిలిపివేసిన అధికారులు,,సదరు మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ముందుకు వెళ్లేందుకు అనుమతించారు.