నెల్లూరులో కాకుండా రాష్ట్ర అంతా వర్షాలు కురుసే అవకాశం?
ఎండలతో మండుతున్న నెల్లూరు…
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది..ఉత్తర కర్ణాటక,,తెలంగాణలోని కొన్ని పాంత్రాల్లో ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు..దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు..భారీ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం అలాగే ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రతగా ఉండాలని ఐఎండీ సూచించింది..ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయన్నారు..కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తుఫాన్లు వస్తేనే:- నెల్లూరులో గత 10 రోజుల నుంచి ఎండలు వేసవి కాలంను తలపిస్తున్నాయి..ఉదయం 5 గంటల నుంచి ఒక రకమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు..ఇదే సమయంలో తూర్పు,పశ్చిమ,కృష్టా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి..వాతావరణశాఖ ఎలాంటి వర్షాల గురించి ఎలాంటి హెచ్చరికలు చేసిని వాటిని పట్టించుకునే స్థితిలో నెల్లూరు ప్రజలు లేరనేది నిజం ఎరిగిన నిష్టూరం..నెల్లూరుజిల్లాకు వర్షాలు అంటే అక్టోబరు చివరి నుంచి మాత్రమే అది కూడా తుఫాన్లు వస్తేనే… ఒక వేళ వర్షాలు కురిశాయి అంటే ఎక్కడో లెక్క తప్పినట్లే…