ప్రముఖ తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్ పరిస్థితి విషమం
అమరావతి: ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాక్ జాకీర్ హుస్సేన్(73) అనారోగ్యంతో అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ ఆసుపత్రిలో ICU వున్నారు..గత వారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేర్పించారు.. ప్రస్తుతం జాకీర్ హుస్సేన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం..7 సంవత్సరాల వయస్సులోనే తబలా వాయించడం ప్రారంభించాడు..జాకీర్ హుస్సేన్ సన్నిహిత మిత్రుడు, ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియా ఆయన గత వారం గుండె సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు..జాకీర్ హుస్సేన్ చాలా కాలంగా రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.. సంగీత ప్రపంచంలో జాకీర్ హుస్సేన్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు..జాకీర్ హుస్సేన్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అవార్డులను కూడా అందుకున్నారు..