అనుమతులు ప్రకారం లేని నిర్మాణాలను తొలగించండి-కమిషనర్ సూర్య తేజ
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలో అనుమతులు ప్రకారం లేకుండా జరుగుతున్ననిర్మాణాలను, అనధికార కట్టడాలను గుర్తించి తొలగించాలని కమిషనర్ సూర్యతేజ, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఆదేశించారు పారిశుధ్య పనులు పర్యవేక్షణలో భాగంగా సోమవారం స్థానిక బాలాజీ నగర్, మూలాపేట, వాకర్స్ రోడ్డు ప్రాంతాల్లో నిర్మాణాలు జరుగుతున్న భవనాలను కమిషనర్ తనిఖీ చేశారు. భవనాల నిర్మాణాలకు సంబంధించి అనుమతుల పత్రాలను కమిషనర్ పరిశీలించారు. ప్లాన్ ప్రకారం నిర్మాణం జరగాలని, నిబంధనలకు విరుద్ధంగా అదనపు నిర్మాణం జరిపితే తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. భవన నిర్మాణాలకు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులు తప్పనిసరి అని, అనుమతులు లేకుండా ఏలాంటి నిర్మాణాలు చేపట్టరాదని సూచించారు. ఈ కార్యక్రమాల్లో యస్.ఈ. రామ్మోహన్ రావు,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చైతన్య, శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్, సచివాలయ వార్డ్ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.