జాతీస్థాయి పోటీ పరీక్షల్లో సైతం నారాయణ విద్యా సంస్థల విద్యార్దులే ముందుంటారు-జి.ఎం భాస్కర్ రెడ్డి
నెల్లూరు: నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమి నుంచి 2024 NEET పరీక్షలో దాదాపు 350 మందికి పైగా విద్యార్దులు సీట్లు సాధించడం అభినందనీయమని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి.విజయభాస్క్ రెడ్డి అన్నారు.ఆదివారం నారాయణ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోని అడిటోరియంలో 2024 NEET సక్సెస్ మీట్ నిర్వహించిన సందర్బంగా అయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ 2024 NEETలో జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన మెడికల్ కళాశాల్లో ప్రవేశాలు సాధించేందుకు నారాయణ మైక్రోషెడ్యుల్స్, ఎర్రర్ అనాలసిస్,పేపర్ డిస్కషన్స్, లాంటి ప్రణాళికలు,జాతీయస్థాయి మెటీరియల్,సమర్దవంతంమై అధ్యాపాకుల బృందం చేసిన కృషే అన్నారు. ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయిన నారాయణ సంస్థల్లో చదువున్న విద్యార్దులు విజయకేతనం ఎగురు వేయడం సర్వసాధరణం అని గర్వంగా చెప్పవచ్చాన్నారు. అనంతరం మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్దిని,విద్యార్దులను ఘనంగా సత్కరించి,మెమెంటోలు అందచేశారు.ఈకార్యక్రమంలో కోర్ డీన్ జయకుమార్ రాయుడు,,డీన్ లు విష్టువర్దన్ రెడ్డి,,శ్రీనివాసులు,,సుధాకర్ రెడ్డి,,ఎజీఎంలు పెంచలరెడ్డి,హాజరత్ నాయుడు,,గురవయ్య,,కృష్ణారెడ్డి,,పద్మారెడ్డి,,ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులు,,విద్యార్దిని విద్యార్దుల తల్లి,తండ్రలు వున్నారు.