నేత్రానందగా ప్రారంభంమైన పూరీ జగన్నాథుని రథయాత్ర
అమరావతి: జగన్నాథుని రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది..ఒడిశాతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా పూరీకి చేరుకున్నారు..ఆదివారం సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు నందిఘోష,, తాళధ్వజం,,పధ్వధ్వజం రథాలపై తల్లి చెంతకు పయనమయ్యారు.. ఈ యాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జగన్నాథుడి పాల్గొన్నారు.. ఆదివారం తెల్లవారు జామున రత్న సింహాసనంపై చతుర్థామూర్తులు కొలువుదీరారు.. అనంతరం జగన్నాథుడి నవయవ్వన రూపాలంకరణ చేశారు..మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ, గోపాలవల్లభ సేవలు తర్వాత నేత్రోత్సవం నిర్వహించారు..అనంతరం 5 ½ అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేశారు..అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెట్టారు.. ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథంపై ప్రతిష్ఠించారు.. అనంతరం దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని భక్తుల జయధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకు వచ్చి నందిఘోష రథం మీద ఉంచారు..ఒడిశా ముఖ్యమంత్రి చరణ్ మాఝీ,, మాజీ సీఎం నవీన్ పట్నాయక్,,కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి లాంఛనప్రాయంగా యాత్ర ప్రారంభించారు..”జై జగన్నాథా” అంటూ భక్తులు తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం ప్రారంభించారు.