బంగాళాఖాతంలో ఆల్పపీడనం-11 నాటికి వాయుగుండగా మారే అవకాశం
అమరావతిం ఆగ్నేయ బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో, శనివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది.. ఇది రాబోయే 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగుతూ డిసెంబర్ 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంకు చేరే అవకాశం ఉందని పేర్కొంది.. శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరి, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.