డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరికిన ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత?
హైదరాబాద్: ఒమేగా హాస్పిటల్ CEO,మహిళా డాక్టర్, చిగురుపాటి.నమ్రత డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది..ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ.. షేక్‌పేట్‌లోని తన నివాసం అయిన అపర్ణ వన్ అపార్ట్ మెంట్లో దొరికిపొయింది.. వంశ్ టక్కర్‌కు రూ.5 లక్షలు ఆన్లైన్ ద్వారా పంపి, 53 గ్రాముల కొకైన్ చిగురుపాటి నమ్రత ఆర్డర్ ఇచ్చింది.. వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ కింద పనిచేస్తున్న డెలివరీ ఏజెంట్ బాలకృష్ణ అలియాస్ రాంప్యార్ రామ్ ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్ ను డెలివరీ చేశారు..విశ్వసనీయ సమాచారంతో నమ్రత కొకైన్ తీసుకుంటుండగా రాయదుర్గం పోలీసులు,, డ్రగ్స్ కొరియర్ ను,, అమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. ముంబైలోని ఓ పబ్ లో ఆమెకు డ్రగ్స్ అలవాటు అయ్యాయని,,ప్రస్తుతం అమె పరిస్థితిను గమనించిన పోలీసులు,అమెను రిహాబిలిటేషన్ సెంటర్ కు తరలించినట్లు తెలుస్తొంది.