పారిశ్రామిక ప్రగతి వైపు ఏ.పిని వేగంగా నడిపిస్తాం-చంద్రబాబు
అన్ని మౌలిక సదుపాలు కల్పిస్తాం..
శ్రీసిటీ: భారతదేశంను, ఐటీ ప్రపంచలో తొలి వరుసలో నిలుపుతుందని తాను అనాడే చెప్పానని,,అందుకు అనుగుణంగా హైదరాబాద్ లో పిపిపి మోడల్ లో హైటెక్ సిటీని నిర్మించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.. సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం,సత్యవేడు మండలం పరిధిలోని శ్రీ సిటీ పారిశ్రామికవాడలో సుమారు 1570 కోట్ల పెట్టుబడితో 8480 మంది యువతకు ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ ఉపాధి కల్పన దిశగా 16 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు చేశారు. 900 కోట్ల పెట్టుబడితో 2740 మంది యువతకు ప్రత్యక్ష,,పరోక్ష ఉద్యోగ ఉపాధి కల్పించే విధంగా 8 పరిశ్రమలకు శంఖు స్థాపన భూమి పూజ చేశారు.. ఈసందర్బంలో పలు కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించిన సీ.ఎం మాట్లాడుతూ తాను 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాడే,,ఐ.టీ రెవల్యూషన్ ను గమనించానని తెలిపారు..భవిష్యత్ ఏ.పి కోసం పలు పథకాలు,,మౌలిక వసతుల ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు..నాడు తాను తీసుకున్న నిర్ణయాలకు ఫలితాలు ఐ.టీ ఇండ్రస్ట్రీలో సాప్టవేర్ ఇంజనీర్ల రూపంలో ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన 4 గురులో ఒకరు తెలుగు వారు ఉన్నరన్నారు..ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్దేశించిన 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా,నవ్యంధ్రప్రదేశ్ ను అ దిశగా నడిపిస్తానాని,,ఇందుకు పారిశ్రామికవేత్తల నుంచి సహకారం కావలన్నారు..అలాగే వారి ఉత్పత్తులకు సంబంధించి అన్ని మౌలిక సదుపాయలు,అనుమతులు త్వరతగతిన అందేలా ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు..ఏ.పిలో అమరావతిని దేశంలో అత్యతమ రాజధానిగా మలిచేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకు అడుగులు వేస్తున్నామన్నారు.ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్, హోంశాఖమంత్రి అనిత,డిజిపి ద్వారక తిరుమలరావు,ఎమ్మెల్యేలు సత్యవేడు,గూడూరు కె.అదిమూలం,విజయశ్రీ, వివిధ పరిశ్రమల మరియు శ్రీసిటీ ప్రతినిధులుతదితరులు ఉన్నారు.